తాళ్లపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

by Nallavelli.Anjaneyulu |

ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో జై కిసాన్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు

తాళ్లపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు
X

దిశ, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో జై కిసాన్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెడ్డి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు తీర్చుకోగా.. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Next Story