- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం జలాశయం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మలుపు వద్ద ట్రావెల్స్ బస్సు మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో దొమల పెంట చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సున్నిపెంట వరకు వాహనాలు నిలిచిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మలుపు వద్ద ట్రావెల్స్ బస్సు మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో దొమల పెంట చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సున్నిపెంట వరకు వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. బస్సును పక్కకు తీసేందుకు స్థానికులు, వాహనదారులు ప్రయత్నిస్తున్నారు. మట్టిలో ఇరుక్కున్న బస్సు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళుతున్నట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ జామ్ తో శ్రీశైలం వెళుతున్న భక్తులు, శ్రీశైలంలో దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వెళుతున్న భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల్లో చిన్న పిల్లలు, మహిళలు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. బస్సును తీసేందుకు చాలా సేపటి నుండి ప్రయత్నిస్తున్నప్పటికీ అది కదలకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు.






