ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణే ధ్యేయం : తపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంత రావు

by Ratna Kumari |

ఉపాధ్యాయ హక్కులు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ధ్యేయమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు అన్నారు.

ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణే ధ్యేయం : తపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంత రావు
X

దిశ, కొల్లాపూర్ : ఉపాధ్యాయ హక్కులు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ధ్యేయమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి తపస్ కార్యనిర్వహకవర్గ సమావేశం ఆదివారం కొల్లాపూర్ మండలంలోని సోమశిల లో జరిగింది. ఉపాధ్యాయ సమస్యలపై తపస్ ఎమ్మెల్సీ లు పలుమార్లు రాష్ట్ర అధికారులను కలసి నివేదించిన‌ట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులను పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య అన్నారు. ఈహెచ్ఎస్ విధానంలో సరైన మార్గదర్శకాలు లేకుండానే ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధించడం సమంజసం కాదని జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి అన్నారు. బడుల హేతుబద్ధీకరణపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదని సమావేశం అభిప్రాయ పడింది. ఈ కార్యక్రమలో జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమోని శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్ట నరేందర్ రెడ్డి, అరవింద్, రాజశేఖర్ రావు, నాగరాజు పాల్గొన్నారు.

Next Story