జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న దివి.. అయినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గట్లేదు

by Pulgam srinivas |   (  Updated:2026-06-07 09:36:43  IST  )

దివి లేటెస్ట్ లుక్ వైరల్.. జిమ్ ఫోటోస్‌తో హాట్ టాక్.

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న దివి.. అయినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గట్లేదు
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమెకు షోలోకి ఎంట్రీ ఇవ్వకముందు పెద్దగా గుర్తింపు లేకపోయినా, షోలో పాల్గొన్న తర్వాత మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక దివి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ఫోటోలు, అప్డేట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దివి ఎక్కువ సమయాన్ని జిమ్‌లోనే గడుపుతుంటుంది. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను కూడా ఆమె తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

తాజాగా కూడా దివి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ తీసుకున్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్‌లో కనిపించిన ఆమె, స్టైలిష్ అండ్ హాట్ పోజులతో ఆకట్టుకుంది. ఈ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story