గ‌న్నేరువ‌రం మండ‌లంలో ఘ‌నంగా పోచ‌మ్మ బోనాలు

by Nallavelli.Anjaneyulu |

మండల కేంద్రం గన్నేరువరం, చొక్క రావు పల్లి, పారువెల్ల, సాంబయ్య పల్లి, మైలారం, గోపాలపురం గ్రామాలలో పోచమ్మ బోనాల ను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

గ‌న్నేరువ‌రం మండ‌లంలో ఘ‌నంగా పోచ‌మ్మ బోనాలు
X

దిశ‌, గ‌న్నేరువ‌రం : మండల కేంద్రం గన్నేరువరం, చొక్క రావు పల్లి, పారువెల్ల, సాంబయ్య పల్లి, మైలారం, గోపాలపురం గ్రామాలలో పోచమ్మ బోనాల ను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలు మోస్తూ డప్పు చప్పుళ్లతో శివ సతుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాల్లో తీసుకువచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పాలకవర్గ సభ్యులు, కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

Next Story