- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nithiin Robinhood: హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచే రావాలా.. హీరో ప్రశ్నకు డైరెక్టర్ షాకింగ్ ఆన్సర్
నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘రాబిన్‌హుడ్’

దిశ, సినిమా: నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘రాబిన్‌హుడ్’ (Robinhood). వెంకీ కుడుముల (Venky Kudumula) డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్‌కు మంచి రెస్పాండ్ రాగా.. రీసెంట్‌గా రిలీజైన ‘అది ధ సర్‌ప్రైజు’ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. దీంతో సినిమాపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ (Expectations) క్రియేట్ కాగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈనెల 28న థియేటర్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. సరికొత్త రకంగా ప్రమోషన్స్‌ను హైలైట్ చేస్తూ సినిమాకు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా.. ‘Honest Podcast ft. Team Robinhood’ అనే పేరిట ఓ ఫన్నీ ఇంటర్వ్యూను షేర్ చేశారు. ఇందులో హీరో నితిన్ ప్రశ్నలు వెయ్యగా.. డైరెక్టర్ వెంకీ కుడుముల ఆన్సర్స్ ఇచ్చారు. ఈమేరకు.. ప్రతి హీరోకు తన డైరెక్టర్‌ను కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటాడు. అవి ఇప్పుడు నేను అడుగుతాను మీరు హానెస్ట్‌గా ఆన్సర్ ఇవ్వాలి అంటాడు నితిన్. సరే అంటాడు డైరెక్టర్. నితిన్: ప్రతి సినిమాలో హీరో విలన్‌లను కొడుతుంటే వెనుక ఉన్న విలన్ చూస్తూ తర్వాత వస్తారు ఎందుకు. అందరూ ఒకే సారి రావొచ్చు కదా?. వెంకీ కుడుముల: ఒక్కసారే వస్తే హీరోలకు దెబ్బలు తగులుతాయని మేమే అలా పంపుతాము. నితిన్: సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచే రావాలా ఎందుకు?. వెంకీ కుడుముల: ఇలాంటి ప్రశ్న అడిగే రోజు వస్తుందనే నేను ఇప్పటి వరకు సౌత్ ఇండియన్స్‌నే పెట్టుకున్నా. నితిన్: క్లైమాక్స్‌లో శుభం కార్డు వెయ్యడం ఎందుకు ఆపేశారు. వెంకీ కుడుముల: రిలీజ్ అయ్యాక కదా తెలిసేది.. అది శుభమా? అశుభమా అంటూ ఆన్సర్ ఇస్తాడు. ఫైనల్‌గా నితిన్ అండ్ వెంకీ కుడుముల ఇంటర్వ్యూ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫన్నీగా వైరల్ అవుతోంది.
Read Also..
Nani, Vijay Deverakonda: రీ యూనియన్ పార్టీలో రీ క్రియేట్.. ఆకట్టుకుంటున్న నాని, విజయ్, మాళవిక పోస్ట్






