- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nani, Vijay Deverakonda: రీ యూనియన్ పార్టీలో రీ క్రియేట్.. ఆకట్టుకుంటున్న నాని, విజయ్, మాళవిక పోస్ట్
నేచురల్ స్టార్ నాని (Nani), రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కాంబోలో వచ్చిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’(Yevade Subramanyam).

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani), రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కాంబోలో వచ్చిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’(Yevade Subramanyam). స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తొలి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ విడుదలై ఈ నెల 21కి పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని అదే రోజు రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ రీ యూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా.. అప్పటి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ పోస్టర్‌ను రీ క్రియేట్ చేస్తూ.. ఓ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని, విజయ్, మాళవిక ముగ్గురు కలిసి బైక్‌పై అప్పటి ఫోజ్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హిట్-3’(Hit-3), ‘ది ప్యారడైజ్’(The Paradise) వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంటే.. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ (Kingdom)సినిమాతో బిజీగా ఉన్నాడు.
Recreating the timeless moment from #YevadeSubramanyam 🤩✨
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 12, 2025
Relive the journey in theatres on March 21st!@NameisNani @TheDeverakonda @nagashwin7 @riturv #MalvikaNair @radhanmusic @SwapnaDuttCh #PriyankaDutt @VyjayanthiFilms @SwapnaCinema pic.twitter.com/YmFw8DMXG3






