నా డైరెక్షన్‌లో వేరే వాళ్లు వేలు పెడితే నాకు నచ్చదు.. యువ దర్శకడు షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2026-04-13 11:28:09  IST  )

నేను పేపర్‌పై ఏది రాసుకున్నానో స్క్రీన్‌పై అదే కనిపించాలి.. వేరే వాళ్లు వేలు పెడితే నాకు నచ్చదు అంటున్నాడు యంగ్ డైరెక్టర్ విశిష్ట.

నా డైరెక్షన్‌లో వేరే వాళ్లు వేలు పెడితే నాకు నచ్చదు.. యువ దర్శకడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘బింబిసార’ చిత్రంతో డైరెక్టర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ డైరెక్టర్ వశిష్ట.. మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడిగా మొదట నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వశిష్ట.. నటుడుగా విఫలమైనప్పటికీ దర్శకుడిగా మాత్రం తన మార్క్‌ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్షన్‌పై వశిష్ట చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘నేను డైరెక్షన్ చేసేటప్పుడు ఎవరో వచ్చి నా పనిలో వేలు పెడితే నాకు కోపం వస్తుంది.. నా పని నేను చెయ్యాలి అతను పని అతను చెయ్యాలి.. పేపర్‌పై నేను ఏం రాశానో అదే స్క్రీన్‌పై చూపించాలి.. మధ్యలో వంద మంది వచ్చి వంద మార్పులు చెప్తే అది కిచిడి అయిపోతుంది.. దేవుడు అనుగ్రహంతో బింబిసార, విశ్వంభర లో నేను పేపర్‌పై ఏం రాశానో ఎగ్జాట్‌గా అదే తీశాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. సాధారణంగా కొంతమంది హీరోలు డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్‌కు కొన్ని కొన్ని మార్పులు చేస్తుంటారు. దీంతో దర్శకులు పైకి చెప్పలేక వాళ్లు అనుకన్నది తియ్యలేక ఇబ్బంది పడతారు. అలాంటిది ఇప్పుడు డైరెక్టర్ వశిష్ట ఇలాంటి కామెంట్స్ చెయ్యడంతో అవి వైరల్‌గా మారాయి.

యాక్షన్ సీన్స్‌తో కొత్త షెడ్యూల్ స్టార్ట్.. ఎన్టీఆర్ బర్త్‌డేకు ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్

Next Story