- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OG చూసి కన్నీళ్లు పెట్టిన డైరెక్టర్ సుజిత్ వైఫ్
OG దర్శకుడు సుజీత్ భార్య ప్రవల్లిక. ఎమోషనల్ అయ్యారు. నిన్న రాత్రి OG హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్ తో

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఓజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి... దూసుకువెళుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా... జనాలను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ప్రీమియర్ షోలకు వెళ్లారు. మెగా హీరోలు అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా, ఆద్య కూడా సినిమాలు తిలకించారు. సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో.... సోషల్ మీడియా మొత్తం OG సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది.
అయితే సినిమా సక్సెస్ ట్రాక్ లో పడడంతో దర్శకుడు సుజిత్ భార్య ఎమోషనల్ అయ్యారు. నిన్న రాత్రి OG హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్ తో కలిసి ప్రీమియర్ షోకు వెళ్లారు సుజీత్ భార్య ప్రవల్లిక. ఇక ఈ సినిమా చూసిన తర్వాత... కాస్త ఎమోషనల్ అయ్యారు సుజీత్ భార్య ప్రవల్లిక. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఓజీ కోసం దర్శకుడు సుజీత్ 6 ఏళ్ల కష్టపడి.. సక్సెస్ అందుకున్నారు. ఈ తరుణంలోనే.. ఆయన సతీమణీ ఎమోషనల్ అయినట్లు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్లిక్
Read More..
‘OG’ సినిమా చూసిన అకీరా, మెగా హీరోలు..సీక్రెట్ గా థియేటర్ లోకి !






