‘OG’ సినిమా చూసిన అకీరా, మెగా హీరోలు..సీక్రెట్ గా థియేట‌ర్ లోకి !

by velandi.Saikiran |   (  Updated:2025-09-25 06:16:57  IST  )

Og: విమల్ థియేటర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్, కుమార్తె ఆద్య

‘OG’ సినిమా చూసిన అకీరా, మెగా హీరోలు..సీక్రెట్ గా థియేట‌ర్ లోకి !
X

దిశ‌, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన OG సినిమా... తాజాగా రిలీజ్ అయింది. ముఖ్యంగా ప్రీమియర్ షోలు నిన్ననే పడిపోయాయి. దీంతో జనాలందరూ ఎగబడి చూశారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్, కుమార్తె ఆద్య ఈ సినిమాను తిలకించారు.

సీక్రెట్ గా థియేటర్ లోకి వచ్చిన ఈ ఇద్దరు.. జనాల మధ్య కూర్చొని ఎంజాయ్ చేశారు. అటు మూసాపేట శ్రీరాములు థియేటర్ లో మెగా హీరోలు సాయి తేజ్‌, వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కూడా అభిమానులతో కలిసి రచ్చ చేశారు. పవన్ కళ్యాణ్ సీన్స్ తెరపై కనిపించినప్పుడల్లా ఈలలు అలాగే కేకలు వేస్తూ దుమ్ము లేపారు. కాగా... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించిన ఓజీ సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో... ఈ సినిమా చూసేందుకు జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారు. క్లిక్

Read More..

OG Movie: పవన్ కెరీర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్.. మిగతా వారికి ఎంతంటే?

Next Story