‘ట్విట్టర్‌లో ఏదేదో మాట్లాడుకుంటున్నారు.. కానీ సినిమా కథ తెలిస్తే పిచ్చెక్కిపోతారు’: Director LokeshKanagaraj

by Kodari Anjali |   (  Updated:2025-08-05 02:59:44  IST  )

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కూలీ.

‘ట్విట్టర్‌లో ఏదేదో మాట్లాడుకుంటున్నారు.. కానీ సినిమా కథ తెలిస్తే పిచ్చెక్కిపోతారు’: Director LokeshKanagaraj
X

దిశ, వెబ్‌డెస్క్: లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్ , నాగార్జున అక్కినేని , సౌబిన్ షాహిర్ , ఉపేంద్ర , శృతి హాసన్ , సత్యరాజ్ , అమీర్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వీరితో పాటుగా రచితా రామ్ , రెబా మోనికా జాన్ , జూనియర్ ఎంజీఆర్ , కన్నా రవి , మోనిషా బ్లెస్సీ, కాళీ వెంకట్ కూడా సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. దేవాగా రజనీకాంత్, సైమన్‌గా నాగార్జున, దయాళ్ గా సౌబిన్ షాహిర్, కలీషగా ఉపేంద్ర, ప్రీతి రాజశేఖర్‌గా శృతి హాసన్, రాజశేఖర్ గా సత్యరాజ్, దహాగా ఆమిర్ ఖాన్ నటిస్తున్నారు. సూఅయితే ప్రేక్షకులకు భారీ సర్ప్రైజ్ ఏంటంటే..? కంగ్ నాగార్జున ఈ సినిమాలో విలన్‌గా కనిపిస్తారు. ఈ విషయాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ వీడియో ద్వారా వెల్లడించారు.

కూలీ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్, D-బాక్స్, 4DX ఫార్మాట్లలో గ్రాండ్ విడుదల కానుంది. కాగా ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మూవీ టీమ్. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన లోకేష్ కనగరాజ్ వేదికపై పలు కామెంట్స్ చేశారు. ‘ట్విట్టర్‌లో ఏదేదో మాట్లాడుకుంటున్నారు.. కానీ సినిమా కథ తెలిస్తే పిచ్చెక్కిపోతారు’ అని చెప్పుకొచ్చారు. దీంతో కూలీ మూవీపై జనాల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' నుంచి క్రేజీ అప్‌డేట్‌

Next Story