- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్‌సింగ్' నుంచి క్రేజీ అప్‌డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PawanKalyan), డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్ (Ustaad Bhagat Singh)'.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PawanKalyan), డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్ (Ustaad Bhagat Singh)'. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం కావడంతో.. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు మాత్రమే కాదు, సినీ లవర్స్ కూడా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. వీరి కోసం తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ అందించారు. ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు తెలుపుతూ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్లే ఈ షెడ్యూల్ త్వరగా పూర్తయినట్లు హరీశ్ తెలిపారు.
ఈ సందర్భంగా పవన్‌పై ప్రశంసలు కురిపించారు. 'మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం.. మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే' అంటూ ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. అలాగే ఈరోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు పేర్కొన్నారు. ప్రస్తుతం హరీశ్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల (Sreeleela), రాశీ ఖన్నా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Read More..






