- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Devi Sri Prasad: అది ఎంజాయ్ చేస్తాను తప్ప.. నేనైతే అసలు ఆ పని చేయను
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ... నాకు రీమిక్స్ పాటలు చాలా ఇష్టం. వాటిని ఎంతో ఎంజాయ్ కూడా చేస్తాను. కానీ అలాంటి పాటలు చేయడానికి మాత్రం నాకు ఆసక్తి ఉండదు” అని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి చాలా కాలం అయింది. ఇప్పటివరకు అనేక సినిమాలకు సంగీతం అందించి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం చాలా మంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు తక్కువ సమయంలోనే పాత పాటలను రీమిక్స్ చేస్తూ వస్తున్నారు. కానీ దేవిశ్రీప్రసాద్ మాత్రం తన ఇన్ని సంవత్సరాల సినీ ప్రయాణంలో ఏ సినిమాలోనూ రీమిక్స్ పాటకు సంగీతం అందించలేదు.
గతంలో కూడా తాను రీమిక్స్ పాటలకు సంగీతం అందించనని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రీమిక్స్ పాటల గురించి మాట్లాడిన దేవిశ్రీప్రసాద్, “నాకు రీమిక్స్ పాటలు చాలా ఇష్టం. వాటిని ఎంతో ఎంజాయ్ కూడా చేస్తాను. కానీ అలాంటి పాటలు చేయడానికి మాత్రం నాకు ఆసక్తి ఉండదు” అని చెప్పుకొచ్చారు. ఇక గతంలో కూడా పలు ఇంటర్వ్యూలలో రీమిక్స్ పాటలపై ఆయన ఇదే తరహాలో స్పందించారు. కొంతకాలం క్రితం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘దేవత’ చిత్రంలోని ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ పాటను రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత మొదటగా దేవిశ్రీప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నారని, అయితే రీమిక్స్ పాట గురించి చెప్పిన తర్వాత ఆయన ఈ ఒక్క కారణంతోనే సినిమా నుంచి తప్పుకున్నారని దర్శకుడు హరీష్ శంకర్ ఓ సందర్భంలో వెల్లడించారు. దీంతో రీమిక్స్ పాటల విషయంలో దేవిశ్రీప్రసాద్ ఎంత కట్టుదిట్టమైన నిర్ణయంతో ఉన్నారో అర్థమవుతోంది.






