- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాంబేలో బాలయ్య బాబు కొత్త సినిమా!
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక 111వ చిత్రం ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : నటసింహం, అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక 111వ చిత్రం (NBK 111) ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం నటుడు బాలకృష్ణ బుధవారం సాయంత్రం ముంబయి చేరుకున్నారు.
అక్కడ సుదీర్ఘంగా సాగనున్న ఈ కొత్త షెడ్యూల్‌లో బాలకృష్ణతో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన టాకీ సీన్స్ మరియు హై-వోల్టేజ్ ఫైట్స్ ను భారీ ఎత్తున తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త గెటప్‌లో, ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి అభిమానులను అలరించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






