- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'దే తడి' గ్లింప్స్ విడుదల తేదీ ఖరారు
‘దే తడి’ గ్లింప్స్ విడుదలకు సరికొత్త స్ట్రాటజీ.. 500 మంది గల్లీ డ్రమ్మర్లతో భారీ ఈవెంట్

దిశ, వెబ్ డెస్క్: రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ రెడ్డి ప్రస్తుతం 'దే తడి' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఆదిత్య రావు గంగాసాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ సంస్కృతి నేపథ్యంలో మాస్ యాక్షన్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మార్చి 24, 2026న సాయంత్రం 6 గంటలకు పీపుల్స్ ప్లాజాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ వీడియో విడుదల విషయంలో ఈ మూవీ బృందం సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే మొట్టమొదటిసారి 500 మంది హైదరాబాదీ గల్లీ డ్రమ్మింగ్ ఆర్టిస్టులతో లైవ్ పెర్ఫార్మెన్స్ నిర్వహిస్తూ గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వినూత్న ఈవెంట్ సక్సెస్ అయితే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆశిష్ ఇప్పటివరకు రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ వీటి ద్వారా ఈయనకు విజయాలు దక్కలేదు. మరి పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న 'దే తడి'తో ఈ హీరోకి విజయం దక్కుతుందేమో చూడాలి.






