Bigg Boss: బిగ్ బాస్ అసలు బండారం బయటపెట్టిన యాంకర్ రవి.. నాకు జరిగింది ఎవరికీ జరగలేదు

by Pulgam srinivas |   (  Updated:2026-03-21 08:56:58  IST  )

యాంకర్ రవి మాట్లాడుతూ... కేవలం డబ్బు కోసమే బిగ్ బాస్ లోకి వెళ్ళానని, అక్కడ జరిగేదంతా నిజం కాదని చెప్పారు.

Bigg Boss: బిగ్ బాస్ అసలు బండారం బయటపెట్టిన యాంకర్ రవి.. నాకు జరిగింది ఎవరికీ జరగలేదు
X

దిశ, వెబ్ డెస్క్: అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే ఈ షో తెలుగులో అనేక సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షోలో పాల్గొనే ముందు పెద్దగా గుర్తింపు లేని వారు కూడా, ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించి అవకాశాలతో బిజీగా మారిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులను అలరించిన ప్రముఖ యాంకర్ రవి తాజాగా ఈ షోకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైనప్పటి నుంచే తనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయని, అయితే పనుల కారణంగా చాలా కాలం వరకు ఒప్పుకోలేదని చెప్పారు. కానీ ఒక సమయంలో డబ్బు చాలా అవసరం కావడంతో షోలోకి వెళ్లడానికి అంగీకరించానని తెలిపారు. కేవలం డబ్బు కోసమే వెళ్లానని, ఆ డబ్బుతో ఒక ఇల్లు కొనుగోలు చేసి ఇప్పుడు సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. అలాగే, షోలో వచ్చే ప్రైజ్ మనీ కంటే పారితోషకం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపారు. టెలికాస్ట్ అయ్యేది రోజుకు కేవలం ఒక గంట మాత్రమేనని, అది పూర్తిగా నిజం కాదని అన్నారు.

ప్రేక్షకులు చూసే దానికి, ఇంట్లో నిజంగా జరిగే వాటికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. పదేళ్లకు పైగా టీవీ పరిశ్రమలో పనిచేస్తున్నందున కెమెరాల ముందు ఎలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసని, అవసరమైనప్పుడు నాటకీయంగా కూడా ప్రవర్తించేవాడినని చెప్పారు. కంటెంట్ కోసం ఏం చేయాలో తెలుసుకొని, అందుకు అనుగుణంగా వ్యవహరించేవాడినని తెలిపారు. కెమెరాల మధ్య ఉన్నప్పుడు నటన తప్పదని, పూర్తిగా నిజాయితీగా ఉంటామని ఎవరైనా చెబితే అది నిజం కాదని రవి స్పష్టం చేశారు.

OTT: ఓటీటీలో చిన్న సినిమా రికార్డ్.. చూడకపోతే చాలా మిస్ అయినట్టే

Next Story