OTT: ఓటీటీలో చిన్న సినిమా రికార్డ్.. చూడకపోతే చాలా మిస్ అయినట్టే

by Pulgam srinivas |

ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన మెడ్ ఇన్ కోరియా చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్'లో ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

OTT: ఓటీటీలో చిన్న సినిమా రికార్డ్.. చూడకపోతే చాలా మిస్ అయినట్టే
X

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది స్టార్ హీరోలు నటించిన సినిమాలతో పోలిస్తే పెద్దగా అంచనాలు లేని చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో ఓటీటీలో పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారా? ఆ చిత్రం పేరు మేడ్ ఇన్ కొరియా. ఇందులో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రం ఇదే కావడం విశేషం.

ఇందులోని ఈమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ తమిళ చిత్రం 2026 మార్చి 12 నుంచి 'నెట్‌ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. చిన్నప్పటి నుండి కొరియా వెళ్లాలని ఎంతో ఆశ ఉన్న అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడుతుంది. కొరియా వెళ్ళాక అతడు మోసం చేశాడని తెలుసుకొని బాధపడి, ఆ తర్వాత తనకు నచ్చిన దేశంలో ఎలా జీవితాన్ని ముందుకు సాగించింది అనే పాయింట్ తో ఈ చిత్రం ముందుకు సాగుతుంది.

చాలా సింపుల్ స్టోరీ లైన్ అయినా కూడా ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ అద్భుతంగా డీల్ చేశాడు. చాలామంది దీనిపై మంచి ఫీల్ గుడ్ చిత్రమని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రానికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో 'నెట్‌ఫ్లిక్స్'లో ఈ మూవీ ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో భారీ క్రేజ్ ఉన్న సినిమాల ఓటీటీ ఎంట్రీ లేకపోవడంతో మరికొంత కాలం పాటు ఈ సినిమా ఇంపాక్ట్ ఇలాగే కొనసాగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Next Story