- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
D-55: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న డిజాస్టర్ బ్యూటీ.. అఫీషియల్ అనౌన్స్‌తో హైప్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.ఇందులో భాగంగా ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘D55’ ఒకటి. ఈ మూవీకు అమరన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాను గోపురం ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ ఓ క్రేజీ అప్డేట్ షేర్ చేసుకుంది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘ఇది వస్తుందని మీరు చూడలేదు.. D55 పై ఉన్న అద్భుతమైన అమ్మాయి శ్రీలీల(Sreeleela)ని స్వాగతిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ధనుష్ చేతులు కట్టుకొని నిలబడగా.. శ్రీలీల బొకే పట్టుకొని క్యూట్ స్మైల్ చేస్తుంది. ప్రజెంట్ వీరిద్దరు ఒకే ఫ్రేమ్‌లో ఇలా కనిపించడం చూట్టానికి ఎంతో బాగుంది. మరి ఈ సినిమా అయిన ఈ భామ మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాల్సి ఉంది.
Read More..
వెనక్కి తగ్గిన నాని.. ‘ది ప్యారడైజ్’ విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!






