వెనక్కి తగ్గిన నాని.. ‘ది ప్యారడైజ్’ విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-01 03:45:00  IST  )

నేచురల్ స్టార్ నాని(nani) ‘హిట్-3థర్డ్ కేస్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’(The Paradise).

వెనక్కి తగ్గిన నాని.. ‘ది ప్యారడైజ్’ విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani) ‘హిట్-3థర్డ్ కేస్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’(The Paradise). ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి నానికి ‘దసరా’తో హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో నాని సరసన కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ (Kayadu Lohar)హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు విలన్‌గా శికంజ మాలిక్ పాత్రలో కనిపించబోతున్నారు. నాని జడల్ పాత్రలో నటిస్తుండగా..శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏకంగా ఎనిమిది భాషల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు గత కొద్ది కాలంగా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదే రోజు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. కాబట్టి నాని సినిమాను వాయిదా వేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు టాక్. తాజాగా, ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని ‘ది ప్యారడైజ్’ సమ్మర్ స్పెషల్‌గా జూన్ 25న రిలీజ్ కాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ సమ్మర్‌ను క్యాచ్ చేసుకుని హిట్ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More..

సూర్య-46 థియేటర్లలో వచ్చేది ఎప్పుడంటే..?

Next Story