- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ రోమియో నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. క్యూట్ లుక్‌లో బోల్డ్ బ్యూటీ
స్టార్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor), సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి(Tripti Dimri) జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ రొమాంటిక్ డ్రామా ‘ఓ రోమియో’(O Romeo).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor), సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి(Tripti Dimri) జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ రొమాంటిక్ డ్రామా ‘ఓ రోమియో’(O Romeo). ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో ‘కమినే’, ‘హైదర్’, ‘రంగూన్’ వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్(Vishal Bharadwaj) నాలుగోసారి షాహిద్ కపూర్‌తో జతకడుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మస్సే, దిశా పటానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamanna Bhatia) ఒక ప్రత్యేక పాత్రలో మెరవనుండటం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తాజాగా మేకర్స్ త్రిప్తి దిమ్రీ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఈ చిన్నది చున్నీ తలపై నుంచి వేసుకుని ముఖానికి బొట్టు కూడా లేకుండా కనిపించింది. మినిమల్ మేకప్‌తో చాలా నేచురల్‌గా కనిపించింది. ఇక ఈ పోస్టర్‌కు ‘ఆమె తీవ్రంగా బాధపడుతుంది& తీవ్రంగా పోరాడుతుంది .... 4 రోజుల్లో అఫ్షాన్‌ను కలుస్తాను.. ఓ రోమియో ఈ శుక్రవారం సినిమాల్లోకి వస్తుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహిళలను లైంగిక వస్తువులుగా చూపించడానికి ఒక యాప్‌నే తయారు చేశారు: ఆయేషా ఖాన్






