మహిళలను లైంగిక వస్తువులుగా చూపించడానికి ఒక యాప్‌నే తయారు చేశారు: ఆయేషా ఖాన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-09 08:10:07  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆయేషా ఖాన్(Ayesha Khan) ‘ధురంధర్’(Dhurandhar) మూవీలోని స్పెషల్ సాంగ్‌లో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసింది.

మహిళలను లైంగిక వస్తువులుగా చూపించడానికి ఒక యాప్‌నే తయారు చేశారు: ఆయేషా ఖాన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆయేషా ఖాన్(Ayesha Khan) ‘ధురంధర్’(Dhurandhar) మూవీలోని స్పెషల్ సాంగ్‌లో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో ఊహించని విధంగా అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ షామ్‌లో ఉంది. అంతేకాకుండా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయేషా ఖాన్ ఏఐ వినియోగంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్నెట్‌లో మహిళల భద్రతపై ఆయేషా ప్రశ్నలు టెక్నాలజీ పెరగడం వల్ల ఎంత లాభం ఉందో, అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయని నటి ఆయేషా ఖాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సెలబ్రిటీల ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న మార్ఫింగ్ కంటెంట్ చూస్తుంటే చాలా భయం వేస్తోందని ఆమె పేర్కొంది.

ఇంటర్నెట్‌లో మహిళలను లైంగిక వస్తువులుగా చూపించడానికి ఒక యాప్‌నే తయారు చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘రీసెంట్‌గా విజయ్ సార్‌తో నా ఫోటో ఒకటి తీసుకుని, మేమిద్దరం కౌగిలించుకుంటున్నట్టు AI వీడియో క్రియేట్ చేశారు. అది అస్సలు జరగలేదని నేను అందరికీ చెప్పాల్సి వచ్చింది. అది చూస్తుంటే చాలా రియలిస్టిక్‌గా ఉంది. సాధారణ వ్యక్తులు అది AI వీడియో అని గుర్తుపట్టడం చాలా కష్టం’’ అని ఆయేషా స్పష్టం చేసింది. కేవలం AI మాత్రమే కాదు, పాపరాజీల తీరును కూడా ఆమె తప్పుబట్టింది. ఒక వ్యక్తి అంగీకారం లేకుండా వీడియోలు తీయడం, వారి ఇబ్బందికర క్షణాలు క్యాప్చర్ చేసి పబ్లిక్‌గా పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ఇది చాలా తప్పు అని తెలిసినా కూడా వ్యూస్ కోసం ఇలా చేయడం బాధాకరమని ఆయేషా పేర్కొంది. సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించాలని, టెక్నాలజీని మనుషుల జీవితాలను నాశనం చేయడానికి వాడకూడదని ఆమె కోరింది. ప్రస్తుతం ఆయేషా ఖాన్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఓ రోమియో నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. క్యూట్ లుక్‌లో బోల్డ్ బ్యూటీ

Next Story