రూ.కోట్లలో వసూళ్లు.. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-11 12:49:07  IST  )

న్యాయవాదిని బెదిరించిన ఆరోపణలపై ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ, ఆమె సోదరిడిపై పంజాగుట్టలో పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.

రూ.కోట్లలో వసూళ్లు.. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతిపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు పెట్టుబడి మోసానికి సంబంధించిన వ్యవహారంలో బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

ఇంతకీ ఏంటీ వివాదం..?

దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి రూ.కోట్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగాబాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.

అయితే, మంగ్లీ, ఆమె సోదరుడు తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్రమంగా నిధులు వసూలు చేశారా..లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

రూ.కోట్లలో వసూళ్లు.. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై కేసు నమోదు

Next Story