- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మెగా 158'లో ఆ లుక్‌లో చిరు?
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులను ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో పూర్తి చేస్తూ వస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘కాక’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ టైటిల్‌ను ఫైనల్ చేసి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్‌లో కనిపించనున్నారని సమాచారం. ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా యంగ్ లుక్‌లోనే కనిపించిన నేపథ్యంలో, ఈ కొత్త లుక్ ప్రేక్షకులకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇవ్వనుందని దర్శకుడు బాబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి మరియు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయంతో ఈ కాంబినేషన్‌పై మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి.






