- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అగధ’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆ పాత్రలో కామాక్షి భాస్కర్ల
‘అగాధ’ చిత్రంలో కామాక్షి భాస్కర్ల మహాదేవి పాత్రలో కనిపించనున్నట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: తన అద్భుతమైన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటీమణులలో కామాక్షి భాస్కర్ల ఒకరు. ఆమె చాలా కాలం క్రితమే నటిగా కెరీర్‌ను ప్రారంభించగా, ‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి ఆమెకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ నటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అగాధ’ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ మూవీ బృందం కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో మహాదేవి పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఆమె నల్లని చీర కట్టుకుని, చుట్టూ త్రిశూలాలు, వెలుగుతున్న దీపాల మధ్య గంభీరంగా కూర్చుని కనిపిస్తోంది. ఈ సినిమా మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






