- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యకు షాక్..అఖండ 2 రికార్డులు బద్దలు కొట్టిన చిరు !
చిరంజీవి హీరోగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్స్ ద్వారానే రూ. 11 కోట్లు రాబట్టడం గమనార్హం.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ మన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ( Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న రాత్రి రిలీజ్ అయింది. నిన్న రాత్రి నుంచి ప్రీమియర్లు పడగా, ఇవాళ థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించిన నయనతార హీరోయిన్ గా మెరిసారు. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేశారు. ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో.. జనాలు ఎగబడి చూస్తున్నారు.
అఖండ 2 రికార్డు బ్రేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి?
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బాలయ్య ( Nandamuri Balayya) నటించిన అఖండ 2 ఓవర్సీస్ లో నమోదు చేసిన రికార్డును ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. అఖండ 2 ( Akhanda 2 Movie) ఉత్తర అమెరికాలో ఫైనల్ కలెక్షన్స్ రూ. 9 కోట్లు రాబట్టింది. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్స్ ద్వారానే రూ. 11 కోట్లు రాబట్టడం గమనార్హం. దీంతో ఈ కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ పెద్దలు కూడా షాక్ అవుతున్నారట. ఈ వేవ్ ఇలాగే, కొనసాగితే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రికార్డు కలెక్షన్స్ రాబట్టనున్నట్లు టాక్ నడుస్తోంది.
Read More..






