- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి జోరు...మరో కుర్ర దర్శకుడికి ఛాన్స్..ఇక ప్రళయమే ?
దసరా సినిమాతో సక్సెస్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలతో మూవీ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi ) వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu ) సినిమా చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు మరో కొత్త యంగ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దసరా సినిమాతో సక్సెస్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలతో ( srikanth odela ) మూవీ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ 2026 మే తర్వాత ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ మూవీ భారీ యాక్షన్ చిత్రంగా పట్టాలెక్కనున్నట్లు టాక్. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అటు విశ్వంభర ప్రాజెక్టును చిరంజీవి మధ్యలోనే వదిలేశారట. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ఎడిటింగ్ సెక్షన్ లో ఉంది. రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు.
మన శంకర్ వరప్రసాద్ గారుతో చిరులో జోరు
చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu ) సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా చేయగా నయనతార హీరోయిన్ గా మెరువనున్నారు. వెంకటేష్ (Venkatesh Daggibati) స్పెషల్ పాత్ర చేస్తున్నారు. కాగా, ఈ సినిమా కథ నచ్చడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ భారీ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందట.
Read More..






