- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హమ్మయ్య! పరాశక్తికి సెన్సార్ లైన్ క్లియర్.. రేపే గ్రాండ్ రిలీజ్
పరాశక్తి సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను తొలగించి U/A సర్టిఫికెట్ ను ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన పరాశక్తి సినిమాకు సెన్సార్ చిక్కులు తొలగిపోయాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ నిన్నటి వరకూ సెన్సార్ బోర్డు నుంచి స్పందన లేకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడుతుందన్న సంకేతాలొచ్చాయి. తాజాగా పరాశక్తి సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను తొలగించి U/A సర్టిఫికెట్ ను ఇచ్చింది. సినిమా మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలు వచ్చినట్లు బోర్డు తెలిపింది. దీంతో రేపు ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
పరాశక్తి.. శివకార్తికేయన్ సినీ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఇండియన్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామా మూవీ. 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారే ఛాన్స్ ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి సిఫార్సు చేసిందని, అందుకే సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యమైనట్లు సమాచారం. సుధాకొంగర దర్శకత్వంలో డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు మథిమారన్ పుగజేంది కథను అందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు. రవి మోహన్, అథర్వ, కులప్పులి లీల, దేవ్ రమానాథ్, పృథ్వీరాజన్, గురు సోమసుందరం, బాసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ తదితరులు నటించారు.
Read More..






