చివరి నిమిషంలో అనన్య పాండే సినిమాకు సెన్సార్ బోర్డ్ గట్టి షాక్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-19 06:12:25  IST  )

రిలీజ్ కి మరికొద్ది రోజులే సమయం ఉందనగా ఈ చిత్రబృందానికి సెన్సార్ బోర్డ్ గట్టి షాకిచ్చింది.

చివరి నిమిషంలో అనన్య పాండే సినిమాకు సెన్సార్ బోర్డ్ గట్టి షాక్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే, యంగ్ హీరో లక్ష్య జంటగా నటిస్తున్న చిత్రం ‘చాంద్ మేరా దిల్’. వివేక్ సోని దర్శకత్వంలో పక్కా యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్,ట్రైలర్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే, రిలీజ్ కి మరికొద్ది రోజులే సమయం ఉందనగా ఈ చిత్రబృందానికి సెన్సార్ బోర్డ్ గట్టి షాకిచ్చింది. ఈ సినిమాలో రొమాన్స్ డోస్ చాలా ఎక్కువగా ఉందంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. సినిమాలో ఉన్న పలు ఘాటైన ముద్దు సీన్లపై సెన్సార్ సభ్యులు కత్తెర వేశారు. చిత్రంలో ఉన్న లిప్ లాక్ సీన్లను బోర్డ్ నిశితంగా పరిశీలించి, మొదట ఒక చోట మొత్తం 10 సెకన్ల ముద్దు సీక్వెన్స్‌ను పూర్తిగా తొలగించింది. ఆ సీన్ స్థానంలో కథకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే వేరే విజువల్స్‌ను రీప్లేస్ చేయాలని చిత్రబృందానికి స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా, సినిమాలో వేర్వేరు సందర్భాల్లో వచ్చే దాదాపు 1 నిమిషం 26 సెకన్ల నిడివి గల మరికొన్ని బోల్డ్ లిప్ లాక్ సీన్లను కూడా సెన్సార్ బోర్డ్ తొలగించింది. ఇలా మొత్తంగా చూసుకుంటే సినిమాలోని దాదాపు 96 సెకన్ల రొమాంటిక్ కంటెంట్‌పై సెన్సార్ బోర్డ్ కత్తెర వేసింది. ఈ మార్పులన్నీ పూర్తి చేసిన తర్వాతే చిత్రానికి ‘యూఏ’ (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు టాక్.

ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే.. నా పాత్రే కీలకమంటూ ఆసక్తికర కామెంట్స్

Next Story