ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే.. నా పాత్రే కీలకమంటూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-19 06:13:08  IST  )

ఈ చిత్రంలో తన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే.. నా పాత్రే కీలకమంటూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతోప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె మరికొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అయితే చిత్రాల పరాజయాలతో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సేకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ సరసన ‘సెయాన్’ అనే భారీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ, ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

సినిమా కథ గురించి ఇప్పుడే ఎక్కువ విషయాలు వెల్లడించలేనని చెబుతూనే.. ఈ చిత్రంలో తన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఒక నటిగా తనలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసేందుకు, ప్రేక్షకులకు తన నటనను నిరూపించుకోవడానికి, ఈ సినిమా ఒక మంచి వేదిక అవుతుందని ఆమె గట్టి నమ్మకం వ్యక్తం చేసింది. సినిమాల్లో నటించేటప్పుడు నటీనటులు తాము చేసే పాత్రలకు, ప్రేక్షకులకు నిజాయితీగా ఉండాలని భాగ్యశ్రీ బోర్సే తన అభిప్రాయాన్ని పంచుకుంది. అందుకోసం తాము నటించే చిత్రాల భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆమె పేర్కొంది. గతంలో తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జంటగా ‘కింగ్‌డమ్’ చిత్రంలో నటించినప్పుడు, ఆ భాషపై పట్టు సాధించి తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న భాగ్యశ్రీ.. ‘సెయాన్’ సినిమా కోసం కూడా ప్రస్తుతం ప్రత్యేకంగా తమిళ భాషను నేర్చుకుంటున్నట్లు వెల్లడించింది.

చివరి నిమిషంలో అనన్య పాండే సినిమాకు సెన్సార్ బోర్డ్ గట్టి షాక్!

Next Story