- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’ విషయంలో ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.. అది చూసి నేనే ఆశ్చర్యపోయా: బుచ్చిబాబు
ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని తాను అస్సలు ఊహించలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఇందులో జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఇక ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా.. జూన్ 4న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో, భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అయినప్పటికీ ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ లో ఆమె ముఖం చూపించకుండా, కెమెరాను కేవలం శరీర భాగాలపైనే ఎక్కువ సేపు ఫోకస్ చేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హీరో తన స్నేహితులతో కలిసి.. హీరోయిన్ అనుమతి లేకుండా ఆమెను తాకుతానని చెప్పడం, బలవంతంగా ఆమె వ్యక్తిగత ప్రదేశంలోకి ప్రవేశించడం వంటివి వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ విజయనగరం బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాలో సెకండ్ హాఫ్‌లోని ఎమోషన్స్ వర్కవుట్ అయినప్పటికీ, ఫస్ట్ హాఫ్‌లోని రొమాన్స్ ట్రాక్ తీవ్ర వివాదాస్పదమైంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై దర్శకుడు బుచ్చిబాబు సనా స్పందించారు. ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని తాను అస్సలు ఊహించలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఒక సరదా ప్రేమకథను చూపించాలనేదే మా ఉద్దేశం. కానీ కొన్ని సీన్లు ప్రేక్షకులకు ఇబ్బందికరంగా అనిపిస్తాయని నేను అనుకోలేదు. రైటింగ్ టీమ్ అనుకున్న భావన వేరు. కానీ స్క్రీన్ మీదకు వచ్చేసరికి అది వేరేలా అర్థం ఇచ్చేలా మారింది. అది చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఈ స్పందన చూశాక, నా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో మహిళా పాత్రలను రాసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాను" అని బుచ్చిబాబు తెలిపారు.






