- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగ్లీ పార్టీలో కల్వకుంట్ల కవిత సన్నిహితుడు!
తెలుగు పాపులర్ సింగర్ మంగ్లీ (Singer Mangli) సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె పుట్టినరోజు నేపథ్యంలో.. పార్టీ ఇవ్వగా..

దిశ, వెబ్ డెస్క్: తెలుగు పాపులర్ సింగర్ మంగ్లీ (Singer Mangli) సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె పుట్టినరోజు నేపథ్యంలో.. పార్టీ ఇవ్వగా.. ఈ సందర్భంగా విదేశీ మద్యం, గంజాయి దొరికినట్లు పోలీసులు కీలక ప్రకటన చేశారు. మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా... రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్ట్ లో.. తన సన్నిహితులతో అర్ధరాత్రి పార్టీ నిర్వహించారు. ఈ పుట్టినరోజు పార్టీకి.. ఆమె స్నేహితులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తం 60 మంది.. హాజరైనట్లు చెబుతున్నారు. విదేశీ మద్యం అలాగే గంజాయి కొడుతున్నారని సమాచారం రావడంతో.. రంగంలోకి పోలీసులు దిగారు. దీని నేపద్యంలోనే అర్ధరాత్రి 2 గంటల సమయంలో.. ఆ రిసార్ట్ పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా కొంతమందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో కొంతమందికి టెస్టులలో గంజాయి పాజిటివ్ గా వచ్చిందని సమాచారం అందుతుంది. అయితే మంగ్లీ ఇచ్చిన పార్టీలో... కల్వకుంట్ల కవిత ( Kavitha ) సన్నిహితుడు కూడా... ఉన్నట్లు చెబుతున్నారు.
అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పార్టీలో తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇతను కూడా... విదేశీ మద్యం తాగి చిందులు వేసినట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు.. వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సంఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అటు... ఘటనా స్థలంలో వీడియోలు తీస్తుంటే పోలీసులపై... రెచ్చిపోయి మంగ్లీ ప్రవర్తించినట్లు కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి.
Read More..
Singer Mangli: లిక్కర్ పార్టీలో దురుసు ప్రవర్తన..మంగ్లీకి తెలంగాణ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్






