- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కుమార్తెపై వేధింపులు.. నిందితుడు అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 13 ఏళ్ల కుమార్తెను ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో వేధించిన కేసులో మహారాష్ట్ర సైబర్ విభాగం పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 13 ఏళ్ల కుమార్తెను ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో వేధించిన కేసులో మహారాష్ట్ర సైబర్ విభాగం పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. సాంకేతిక విశ్లేషణ, డిజిటల్ ట్రాకింగ్ ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతడు ఇతరులతో కూడా ఇలాగే ప్రవర్తించాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గతేడాది అక్టోబర్‌లో ముంబై స్టేట్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ తన కుమార్తెకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తన కుమార్తె ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తులతో వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో, అవతలి వ్యక్తి మొదట మర్యాదగా మెసేజ్‌లు చేస్తూ నమ్మకం పెంచుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత తను ముంబైకి చెందిన అమ్మాయి అని తెలుసుకుని, ‘నీ న్యూడ్ ఫోటో పంపిస్తావా?’ అని అసభ్యకరంగా మెసేజ్ చేశాడని అక్షయ్ వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన తన కుమార్తె వెంటనే గేమ్‌ను ఆఫ్ చేసి, ఆ విషయాన్ని తన తల్లికి చెప్పిందని వివరించారు.
వెంటనే రంగంలోకి దిగిన సైబర్ సెల్
ఈ సంఘటనను అక్షయ్ వెల్లడించిన వెంటనే రంగంలోకి దిగిన సైబర్ సెల్ దర్యాప్తు ప్రారంభించి, తాజాగా నిందితుడిని పట్టుకుంది. సైబర్ నేరాలు సాధారణ వీధి నేరాలకంటే ప్రమాదకరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన అక్షయ్.. పిల్లలకు సైబర్ భద్రత, డిజిటల్ ప్రపంచం గురించి అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో వారం వారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. కాగా, ఆన్ లైన్ ఆర్థిక మోసాలు, సైబర్ బుల్లింగ్ తదితర అంశాలపై విద్యార్థులను అప్రమత్తం చేసేందుకు ఇటీవల ముంబైలోని ఓ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో అక్షయ్ మాట్లాడిన ఈ వీడియోను ప్రదర్శించి వారిలో అవగాహన కల్పించారు.






