- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూన్ 10న 'NBK111' నుంచి బిగ్ అప్డేట్
జూన్ 10 తేదీన 'NBK111' మూవీ నుండి టైటిల్, ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ చిత్రానికి సంబంధించిన సాలిడ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. “No More Vintage.. Only New Age” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా “Stamping Its Authority Everywhere” అనే పదాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పోస్టర్‌లో జూన్ 10 తేదీని ప్రత్యేకంగా హైలైట్ చేయడం గమనార్హం. దీంతో ఆ రోజున ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మేకర్స్ పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను విడుదల చేయడంతో, రాబోయే అప్‌డేట్ కూడా అదే స్థాయిలో సాలిడ్‌గా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






