‘ఆవారాపన్ 2’ టీమ్ నుంచి బిగ్ అప్‌డేట్

by Pulgam srinivas |

ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తైనట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

‘ఆవారాపన్ 2’ టీమ్ నుంచి బిగ్ అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఆవారాపన్ 2’పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. 2007లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆవారాపన్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ‘ఆవారాపన్ 2’ మూవీ టీమ్ కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైనట్లు అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక ఫోటోను విడుదల చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్ర మొదటి భాగం మంచి విజయాన్ని సాధించడంతో ‘ఆవారాపన్ 2’పై హిందీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సీక్వెల్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి. నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విశేష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ముకేశ్ భట్, విశేష్ భట్ నిర్మిస్తున్నారు.




Next Story