‘పెద్ది’ కోసం భారీ ప్లాన్.. ఏకంగా రెండు పెయిడ్ ప్రీమియర్స్?

by Pulgam srinivas |   (  Updated:2026-05-28 14:42:52  IST  )

‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 3న రెండు షోలుగా నిర్వహించేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం.

‘పెద్ది’ కోసం భారీ ప్లాన్.. ఏకంగా రెండు పెయిడ్ ప్రీమియర్స్?
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్‌ను జూన్ 3వ తేదీనే తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రీమియర్ షోలు అంటే సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి దాదాపు ఒక్క షో మాత్రమే ప్రదర్శిస్తారు. కానీ ‘పెద్ది’ సినిమాకు మాత్రం రెండు ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 3న సాయంత్రం 6:55 గంటలకు ఒక షో, రాత్రి 10:30 గంటలకు మరో షో నిర్వహించేలా ప్లానింగ్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక జీవో తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ జీవో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ‘పెద్ది’ పెయిడ్ ప్రీమియర్స్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అయితే ప్రీమియర్స్ విషయంలో మేకర్స్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తారు? రెండు షోలతో ఎలాంటి ప్లానింగ్ అమలు చేస్తారు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

‘పెద్ది’ మూవీ పైరసీకి అడ్డుకట్ట.. మద్రాస్‌ హైకోర్టు సంచలన ఉత్తర్వులు

Next Story