- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ మూవీ పైరసీకి అడ్డుకట్ట.. మద్రాస్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు
రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ సినిమా పైరసీకి గురి కాకుండా మద్రాస్ హైకోర్టు బ్రేకులు వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన ‘పెద్ది’ (Peddhi) సినిమాకు పైరసీ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే ఇంటర్నెట్‌లో అన్ ఆఫీషియల్ లింక్స్ అప్‌లోడ్ చేయడం, థియేటర్లలో విడుదలైన వెంటనే పైరసీ కాపీలను వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, వెబ్‌సైట్లలో రిలీజ్ చేయడం వంటి అక్రమ చర్యలను అడ్డుకోవాలని కోరుతూ ‘పెద్ది’ చిత్ర నిర్మాత మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పైరసీ వల్ల చిత్ర బృందంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
యాంటీ-పైరసీ ఇంజంక్షన్ ఆర్డర్..
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. నిర్మాత వాదనలతో ఏకీభవించింది. సినిమా హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ‘పెద్ది’ చిత్రానికి ‘యాంటీ-పైరసీ ఇంజంక్షన్’ (Anti-Piracy Injunction) ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs), పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ సినిమా కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయడానికి వీల్లేదు. సినిమాకు సంబంధించిన ఎలాంటి అనధికారిక డౌన్‌లోడ్, స్ట్రీమింగ్ లింకులు కనిపించినా వాటిని తక్షణమే బ్లాక్ చేయాలని సైబర్ సెల్‌ను సైతం ధర్మాసనం ఆదేశించింది. కాగా,. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ ముందస్తు ఆదేశాలతో ‘పెద్ది’ చిత్ర బృందానికి, నిర్మాతలకు భార ఊరట లభించనట్లైంది.






