‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్.. కూల్ లుక్‌లో కిర్రాక్ అనిపిస్తున్న హీరో

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-30 05:40:34  IST  )

మాస్ మహారాజ రవితేజ(Raviteja) నటిస్తున్న తాజా సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaki Vignapthi).

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్.. కూల్ లుక్‌లో కిర్రాక్ అనిపిస్తున్న హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ(Raviteja) నటిస్తున్న తాజా సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaki Vignapthi). కిశోర్ తిరుమల(Kishore tirumala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దీన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్ అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 14 రోజుల సమయం మాత్రమే ఉన్నదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంతో నిన్న మూవీ టీమ్ ఈ సినిమా కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఈ మేరకు ఎక్స్ వేదికగా ‘సంక్రాంతి సీజన్‌లో అతిపెద్ద ఎంటర్‌టైనర్.. భక్త మహాశయులకు విజ్ఞప్తి కోసం 15 రోజులు మిగిలి ఉన్నాయి.. జనవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా #BMW గ్రాండ్‌గా విడుదల కానుంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే రవితేజ క్యాజువల్ డ్రెస్‌లో నల్ల కళ్లజోడు పెట్టుకొని ట్రైన్ డోర్ దగ్గర నిలబడి కూల్ అండ్ కామ్ లుక్‌లో కిర్రాక్‌గా అనిపించాడు.

Read More..

విజయ్-రష్మిక మ్యారేజ్ రూమర్స్ వేళ నెట్టింట చక్కర్లు కొడుతున్న సూపర్ ఫొటో.. రెండు కళ్లు సరిపోవట్లేదంటున్న ఫ్యాన్స్

Next Story