- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్-రష్మిక మ్యారేజ్ రూమర్స్ వేళ నెట్టింట చక్కర్లు కొడుతున్న సూపర్ ఫొటో.. రెండు కళ్లు సరిపోవట్లేదంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ సెలబిట్రీలు విజయ్ దేవర కొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ సెలబిట్రీలు విజయ్ దేవర కొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ‘గీత గోవిందం’(Geetha Govindam), ‘డియర్ కామ్రెడ్’(Dear Comrade) వంటి సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. ఆన్ స్క్రీన్ వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. అయితే వీరు రియల్ లైఫ్‌లో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయంపై ఈ జంట అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ పలు మార్లు మీడియాకు చిక్కడం, వేకెషన్స్‌కు వెళ్లినప్పుడు సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫొటోలు పెట్టడంతో ఎట్టకేలకు వీళ్లు రిలేషన్‌లో ఉన్నారని అందరూ కన్ఫర్మ చేసుకున్నారు.
ఈ క్రమంలో రీసెంట్‌గా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఓ ఈవెంట్‌లో రష్మిక చేతికి ఉంగరం ఉండటంతో ఈ పుకార్లకు ఆజ్యం పోయినట్లయింది. ఈక్రమంలో వీరిద్దరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు, రాజాస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత స్ననిహితుల మధ్య ఫిబ్రవరి 26న ఈ జంట మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇలా మ్యారేజ్ డేట్ రూమర్స్ జోరందుకున్న వేళ విజయ్-రష్మికల ఓ క్రేజీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పిక్‌లో విజయ్ పంచకుట్టుకొని ఉండగా రష్మిక మెరూన్ కలర్ పట్టు శారీ కట్టుకొని ఒంటినిండా నగలతో సింగారించుకుని కొత్త పెళ్ళికూతురిలా ఉంది. ఇక విజయ్ రష్మిక ఊయల మీద కూర్చుని ఉన్నారు. అంతేకాకుండా రౌడీ హీరో మన నేషనల్ క్రష్‌కు ఉంగరం తొడుగుతుండగా ఆమె సిగ్గు పడుతూ ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూసి వీరి ఫ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ ప్లేస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!






