- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ ప్లేస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజులుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ జంట మాత్రం స్పందించడం లేదు. ఇక ఇటీవల వీరిద్దరు తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి అక్టోబర్‌లో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ గురించి రష్మిక, విజయ్ ఎక్కడా మాట్లాగలేదు. అలాగే అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయినప్పటికీ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే రష్మిక చేతి రింగ్‌తో నిశ్చితార్ధం పుకార్లు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ జంట మాత్రం పెళ్లిపై ఎలాంటి హింట్ ఇవ్వడం లేదు.
ఇద్దరు సైలెంట్‌గా ఉంటూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈక్రమంలో.. తాజాగా, విజయ్, రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజస్థాన్‌లోని అందమైన ఉదయ్‌పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ దేవరకొండ ఏడడుగులు వేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే గతంలో కూడా ఇలాంటి పెళ్లి డేట్ వార్తలు చాలాసార్లు వచ్చి, అవననీ రూమర్లగానే మిగిలిపోయాయి. ఇక ఈ సారి కూడా అలాగే జరుగుతుందని కొందరు అంటేంటే.. మరికొందరు మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చర్చించుకుంటున్నారు.
Read More..
పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల ఒత్తిడి.. సీరియల్ హీరోయిన్ ఆత్మహత్య






