- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల ఒత్తిడి.. సీరియల్ హీరోయిన్ ఆత్మహత్య
పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో కన్నడ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కన్నడ మరియు తమిళ సీరియల్స్ లో నటిస్తున్ననందిని సీఎం బెంగుళూరులోని తన నివాసంతో ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ లో తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని.. దానికి మానసికంగా తాను సిద్ధంగా లేనని పేర్కొంది. అంతే కాకుండా ఇరత సమస్యల కారణంగా డిప్రెషన్ తోనూ బాధపడుతున్నట్టు పేర్కొంది. కాగా నంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిగా తెలుస్తోంది.
కానీ తమిళ, కన్నడ సీరియల్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలో ఆమె నటించిన గౌరి సీరియల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్ లో కనకదుర్గ పాత్రలో డబుల్ రోల్ చేసి ప్రేక్షకులను అలరించింది. దీంతో పాటు కన్నడలో జీవా హూవాగిడే, సంఘర్ష, మధుమగలు లాంటి సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రల్లో నటించింది. నటి మృతితో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.






