బండ్ల గణేష్ మరో కొత్త బ్యానర్

by Muthe.Rajitha |   (  Updated:2025-12-30 05:39:43  IST  )

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు.

బండ్ల గణేష్ మరో కొత్త బ్యానర్
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం ఆయన ‘బీజీ బ్లాక్‌బస్టర్’ (BG Blockbusters) అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను ప్రకటించారు. ఇది బండ్ల గణేశ్‌కు రెండో బ్యానర్ కాగా, గతంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ కింద గబ్బర్ సింగ్, టెంపర్ వంటి భారీ హిట్లు నిర్మించారు. కొత్త బ్యానర్ ద్వారా హృదయాలను తాకే కథలు, ఎమోషనల్ స్టోరీలు, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తూ సినిమాలు నిర్మిస్తానని ఆయన తెలిపారు.

2015లో టెంపర్ తర్వాత దాదాపు పదేళ్ల విరామం తీసుకున్న బండ్ల గణేశ్, అక్టోబర్ 2025లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పినట్టే ఇప్పుడు కొత్త బ్యానర్‌తో టాలీవుడ్‌లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దీంతో త్వరలోనే కొత్త సినిమాల ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read More..

ప్రభాస్, పవన్‌ల నిజ స్వరూపం బయటపెట్టిన సుమ.. షాకింగ్ విషయాలు రివీల్ !

Next Story