ఆ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న బాలయ్య.. కొరటాల మూవీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-25 09:15:23  IST  )

బాలయ్య–కొరటాల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు మే 1వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

ఆ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న బాలయ్య.. కొరటాల మూవీ
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న బాలయ్య, తాజాగా కొరటాల శివ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు మే 1వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది.

అనంతరం రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. పూజా కార్యక్రమాల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాలయ్య–కొరటాల కాంబినేషన్ అంటేనే అంచనాలు తారాస్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌తో పాటు బాలకృష్ణ, దర్శకులు విజయ్ కనకమెడల మరియు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోయే సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘అఖండ 2’ తర్వాత ఆలోచనలో బోయపాటి.. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అప్పుడే?

Next Story