- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అఖండ 2’ తర్వాత ఆలోచనలో బోయపాటి.. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అప్పుడే?
మరో వారం రోజుల్లో బోయపాటి శ్రీను తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కూడా అనేక సంవత్సరాల పాటు తిరుగులేని దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఎక్కువగా బాలకృష్ణతో చేసిన సినిమాలతో ఆయనకు భారీ విజయాలు దక్కాయి. అఖరుగా ఈయన బాలకృష్ణ హీరోగా ఆయన రూపొందించిన ‘అఖండ 2’కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఈ సినిమా విడుదలై ఇప్పటికే కొంతకాలం గడిచినా బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటికీ అధికారిక ప్రకటన వెలువడలేదు. మధ్యలో ఆయన అల్లు అర్జున్‌తో సినిమా చేస్తారని, అలాగే సూర్యతో కూడా ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యారని రూమర్లు వినిపించాయి. అయితే వీటిపై ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, హిందీ భాషల నుంచి కూడా ఆఫర్లు అందుకుంటున్నారని సమాచారం. అయినప్పటికీ ఆయన సరైన కథ, బలమైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు, మరో వారం రోజుల్లో తన తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.






