- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ 2 ట్విట్టర్ టాక్..బాలయ్య విశ్వరూపమే !
నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్లు పడిపోగా, నేటి నుంచి షోలు కొనసాగనున్నాయి. ఇప్పటికే బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో అఖండ సినిమా వచ్చి సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ అఖండ 2 సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
సినిమా చూసిన వాళ్లంతా అద్భుతం అంటున్నారు. హిందూ ధర్మం చుట్టూ కొనసాగే ఈ సినిమా, ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా సినిమా చూసిన వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ పెద్దగా లేకపోయినా, సెకండాఫ్ మాత్రం ఇరగదీస్తుందట. దైవం మీద పడిన నిందలు తొలగించడం, హిందూ ధర్మం రక్షణ కోసం హీరో నందమూరి బాలయ్య ఏం చేస్తాడు ? అన్నది సినిమా స్టోరీ.
ఈ కథ నేపథ్యంలో నందమూరి బాలయ్య జీవించేసాడని అంటున్నారు. అఖండ రూపంలో ఉన్న నందమూరి బాలయ్య కనిపిస్తే, థియేటర్ దద్దరిల్లిపోతుందట. దానికి తగ్గట్టుగానే మన తమన్ మ్యూజిక్ ఇరగదీసాడట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ ఖాయం అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసారట. అందులో కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదని ప్రేక్షకులు అంటున్నారు. బాలయ్య హీరోగా ఇరగదీసినప్పటికీ విలన్ ప్రభావం పెద్దగా కనిపించదట. కొన్ని సీన్లు సాగదీయడంతో బోర్ కొడుతాయట.
READ MORE .....






