గ్లామర్ షోతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న అవికా గోర్

by Pulgam srinivas |   (  Updated:2026-05-29 12:08:25  IST  )

హాట్ అందాలతో హీట్ పెంచుతున్న అవికా గోర్.

గ్లామర్ షోతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న అవికా గోర్
X

దిశ, వెబ్ డెస్క్: సీరియల్స్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించి సినిమాల్లో అద్భుతంగా రాణించిన ముద్దుగుమ్మల్లో అవికా గోర్ ఒకరు. ఈమె రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉయ్యాల జంపాల చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు రావడం మొదలైంది. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు కూడా అందుకున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నందు ప్రధాన పాత్రలో రూపొందిన అగ్లీ స్టోరీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. కెరీర్ ప్రారంభంలో అందాల ఆరబోతకు కాస్త దూరంగా ఉన్న ఈ బ్యూటీ, ఆ తర్వాత తన గ్లామర్‌తో యువతను బాగానే ఆకట్టుకుంది.

సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ నటి తన అందాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో తన హాట్ ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో ముఖంపై పడేలా కురులను వదిలేసి, చెవులకు ఇయర్ రింగ్స్ ధరించి స్టైలిష్‌గా కనిపించింది. మొత్తంగా ఈ పిక్స్‌లో అవికా గోర్ సూపర్ హాట్ లుక్‌లో కనిపించడంతో అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నేను కూడా మనిషినే దయచేసి నన్ను బూతులు తిట్టకండి.. ట్రోలింగ్‌పై పూనమ్ పాండే ఎమోషనల్ పోస్ట్

Next Story