నేను కూడా మనిషినే దయచేసి నన్ను బూతులు తిట్టకండి.. ట్రోలింగ్‌పై పూనమ్ పాండే ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

నేను మానసికంగా కాస్త బాధలో ఉన్నాను. అందుకే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దామని లైవ్‌లోకి వచ్చాను. నేను ఇంతకంటే ఎక్కువ మాటలను భరించలేకపోతున్నాను.

నేను కూడా మనిషినే దయచేసి నన్ను బూతులు తిట్టకండి.. ట్రోలింగ్‌పై పూనమ్ పాండే ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా సెన్సేషన్ పూనమ్ పాండే ఎన్నో చిత్రాల్లో నటించి విపరీతమైన క్రేజ్ రాబట్టుకుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా, పూనమ్ పాండే పెట్టిన ఓ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిత్యం సంచలన పోస్టులతో విమర్శలు పాలవుతున్నప్పటికీ తన తీరు మార్చుకోని పూనమ్.. గత కొద్ది కాలంగా తనపై వస్తున్న ట్రోలింగ్‌‌ను తట్టుకోలేకపోతున్నానని లైవ్ వీడియోలో కన్నీరు పెట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీడియోను షేర్ చేస్తూ.. ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు దాటినా తగిన గుర్తింపు కోసం.. సినిమా అవకాశాల కోసం తాను ఎంతో కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన వెనుక ఉన్న కథ ఏంటో తెలియకుండానే ట్రోలింగ్ చేస్తున్నారని ఆ మాటలను తాను తట్టుకోలేకపోతున్నానని ఎమోషనల్ అయింది. ‘‘నేను మానసికంగా కాస్త బాధలో ఉన్నాను. అందుకే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దామని లైవ్‌లోకి వచ్చాను.

నేను ఇంతకంటే ఎక్కువ మాటలను భరించలేకపోతున్నాను. నేను కూడా ఒక మనిషినే. 14 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి పని వెతుక్కుంటూ వచ్చాను. ఈ రోజుకి కూడా పని కోసమే చూస్తున్నాను. నన్ను జనాలు గుర్తించడం కోసం థియేటర్ ఆర్ట్స్ కూడా చేస్తున్నాను’’ అని ఎమోషనల్ అయింది. అంతేకాకుండా తనను తాను నిరూపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. తన గతాన్ని పూర్తిగా తెలుసుకోకుండా.. తనను జడ్జ్ చేయొద్దని కోరింది. కనీసం బూతులు తిట్టడం అయినా ఆపాలని కన్నీరు పెట్టుకుంది. తాను ఎప్పుడూ ఎవరినీ తిట్టలేదని.. కాబట్టి తనను కూడా అలా అనొద్దని రిక్వెస్ట్ చేసింది. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలంటూ వీడియోను ముగించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..ఈ విషయం నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం చచ్చిపోతున్నట్లు ఫ్రాంక్ చేసావ్ ఇప్పుడు.. ఏం నాటకాలు ఆడుతున్నావంటూ మండిపడుతున్నారు.

Next Story