- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోయిన్ తండ్రిని కాల్చిన దుండగులు.. ఆస్పత్రిలోనే ఎటాక్..
పంజాబీ నటి తానియా తండ్రి డాక్టర్ అనిల్ జిత్ సింగ్ కంబోజ్‌పై ఎటాక్ జరిగింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని కోట్ ఇసే ఖాన్‌లో ఉన్న అతని క్లినిక్, హర్బన్స్ నర్సింగ్ హోమ్‌లో ఇద్దరు అగంతకులు కాల్పులు జరిపారు

దిశ, వెబ్ డెస్క్ : పంజాబీ నటి తానియా తండ్రి డాక్టర్ అనిల్ జిత్ సింగ్ కంబోజ్‌పై ఎటాక్ జరిగింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని కోట్ ఇసే ఖాన్‌లో ఉన్న అతని క్లినిక్, హర్బన్స్ నర్సింగ్ హోమ్‌లో ఇద్దరు అగంతకులు కాల్పులు జరిపారు. రోగులుగా నటించి క్లినిక్‌లోకి ప్రవేశించిన దుండగులు, డాక్టర్ కంబోజ్‌పై సమీపంలో నుంచి రెండు బుల్లెట్లతో కాల్చినట్లు తెలుస్తోంది. ఒకటి ఛాతీలో, మరొకటి పొట్టలో తగలగా.. వెంటనే అతన్ని మోగాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై క్రిటికల్ పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం.
మోగా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ గాంధీ నేతృత్వంలోని పోలీసులు క్లినిక్‌ను సీల్ చేసి.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసినవారు మోటార్‌సైకిల్‌పై పరారైనట్లు తెలుస్తోంది. ఈ దాడి వెనుక కెనడా బేస్డ్ గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లండా నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్‌తో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కిస్మత్, సుఫ్నా, బజ్రే దా సిత్తా వంటి పంజాబీ చిత్రాల్లో నటించిన తానియా.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయింది.
Read More..
విడాకులు తీసుకోబోతున్న ప్రముఖ సీరియల్ నటి.. భర్త గురించి సంచలన వ్యాఖ్యలు..






