- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకులు తీసుకోబోతున్న ప్రముఖ సీరియల్ నటి.. భర్త గురించి సంచలన వ్యాఖ్యలు..
హిందీ సీరియల్ నటి మహి విజ్ భర్త జై భనుషాలితో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన ఆమె.. అసలు మా పర్సనల్ విషయాలు మీకెందుకని ఫైర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : హిందీ సీరియల్ నటి మహి విజ్ భర్త జై భనుషాలితో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన ఆమె.. అసలు మా పర్సనల్ విషయాలు మీకెందుకని ఫైర్ అయింది. ఒకవేళ విడాకుల లాంటివి ఉన్నా మీకెందుకు చెప్పాలని మీడియా పీపుల్‌పై ఫైర్ అయింది. మీరు ఏమైనా నా అంకుల్ అవుతారా? లేక చెప్తే లాయర్ ఫీజు ఏమైనా కడతారా? అని ప్రశ్నించింది. తన గురించి, తన భర్త గురించి పిచ్చి రాతలు రాయొద్దని.. ఎవరో ఒకరి తప్పుందని రాయడం అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చక్కగా బతుకుతూ మమ్మల్ని బతకనిస్తే బాగుంటుందని సూచించింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో తాను ఎప్పుడూ ఒక నటుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని తెలిపింది.
కాగా జై ముందు యాంకర్ కానీ తర్వాత నటుడిగా మారాడు. కాగా ఈ వ్యాఖ్యలతో డివోర్స్ రూమర్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయి. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఈ మధ్య డివోర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని అంటున్నారు. ఏదేమైనా ముగ్గురు పిల్లలు.. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైపోయిన మానసిక ఒత్తిడితో జీవితాంతం బతుకుతారని బాధపడుతున్నారు మరికొందరు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.






