- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రి నుంచి AR రెహమాన్ డిశ్చార్జ్.. హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ సంగీత దర్శకుడు(Music Director), ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు(Music Director), ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆయన్ను శనివారం రాత్రే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఆయన డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సోదరి రిహానా వెల్లడించారు. డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరారని.. చికిత్స తీసుకున్నారని ఆమె తెలిపారు. రెహమాన్ కొన్ని నెలల క్రితమే భార్యతో విడిపోయిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల బంధానికి స్వప్తి చెబుతూ విడాకులు తీసుకున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రెహమాన్ ఇటీవల బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విక్కీ కౌశల్ ‘ఛావా’ చిత్రానికి సంగీతం అందించారు. దాంటో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక #RC16 కోసం కూడా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలను కూడా ఇచ్చేసినట్లు వార్తలు వినిపించాయి. కాగా, రెహమాన్ ఆసుపత్రిలో చేరారనే వార్తలు ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి.
Read More..
ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్.. ఆందోళనలో అభిమానులు






