ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్.. ఆందోళనలో అభిమానులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-16 04:44:37  IST  )

ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకులు(Music Director), ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్(AR Rahman) అస్వస్థతకు గురయ్యారు.

ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్.. ఆందోళనలో అభిమానులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకులు(Music Director), ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్(AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో ఇబ్బంది పడటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కార్డియాలజీ విభాగం వైద్యులు(Doctors of the Cardiology Department) చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. తెలుగులో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన కొమురం పులి సినిమాకు రెహమాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. మొన్న బాలీవుడ్‌లో రిలీజైన సెన్సేషనల్ మూవీ ఛావాకు కూడా రెహమానే సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తోన్న #RC16 కు సైతం ఆయన పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన అనారోగ్యానికి గురి కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

Read More..

ఆంటీ అన్నందుకు దమ్ముంటే పైకి రారా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. పొట్టు పొట్టుగా తిట్టిపోస్తున్న నెటిజన్...

స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన నితిన్, శ్రీలీల.. వావ్ సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్(వీడియో)

Next Story